Tasty Teja: పుష్ప రేంజ్ లో టేస్టీ తేజ.. ఫుడ్ వ్లాగర్ అనుకుంటివా అంతకుమించి!
on Jan 2, 2025
టేస్టీ తేజా అంటే బిగ్ బాస్ అనుకుంటిరా.. అంతకుమించే అనేట్టుగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ బిజినెస్‌ని వ్యాప్తి చేసాడు. ఇప్పుడు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్‌కి గురిపెట్టాడు తేజ. బిగ్ బాస్ సీజన్-7తో పాటు సీజన్-8లోనూ కంటెస్టెంట్‌గా వెళ్లి అత్యధిక రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్‌లో చేరాడు. అంతేకాదు.. రెమ్యూనరేషన్ విషయంలోనూ గట్టిగానే అందుకున్నాడు.
బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న టేస్టీ తేజ.. ఇప్పుడు దానిని వినియోగించుకునే పనిలో పడ్డాడు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేశాడు.అందులో ఏం చెప్పాడంటే.. నన్ను ఇష్టపడే వాళ్లు కేవలం బిగ్ బాస్ షోలేనే కాకుండా బిజినెస్ పరంగా కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఇరానీ నవాబ్ అని ఫ్రాంచైజీ స్టార్ట్ చేశా. ఇప్పటి వరకూ 22 బ్రాంచ్‌లు ఓపెన్ అయ్యాయి. అసలు ఎవడన్నా తేజా గాడూ.. తేజా గాడ్ని నమ్మి అంతమంది ఇరానీ నవాబ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. నన్ను నమ్మి.. అంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారు. త్వరలో మరో 3 బ్రాంచ్‌లు కంప్లీట్ చేసి ఇరానీ నవాబ్ పేరున పెద్ద ఈవెంట్ చేయబోతున్నానని తేజ అన్నాడు.
ఇరానీ నవాబ్‌లో టీ టేస్ట్ బాగుంది కాబట్టి సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరు ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఇప్పుడు యూకే, యూఎస్, దుబాయ్‌లలో కూడా ఇరానీ నవాబ్ టీ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నానంటు చెప్పాడు. అంటే ఈ లెక్కన టేస్టీ తేజా నేషనల్ నుంచి ఇంటర్నేషన్ రేంజ్‌కి వెళ్తున్నాడన్న మాట. లీగల్‌గా కొన్ని పర్మిషన్స్ కావాల్సి ఉన్నాయని వాటి కోసం వెయిట్ చేస్తున్నట్టు.. వాళ్ళ టీమ్ అదే పనిలో ఉందంటూ టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు.
Also Read